హీరో సిలంబరసన్ టీఆర్, వెట్రిమారన్, నిర్మాత కలైపులి ఎస్.ధాను వంటి క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిస్తున్న చిత్రానికి ‘అరసన్’ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ రిలీజ్‌తో శింబు అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్‌లో సిలంబరసన్ టీఆర్ పవర్‌ఫుల్‌గా కనిపించారు.
దర్శకుడు వెట్రిమారన్, నిర్మాత కలైపులి ఎస్.ధాను లాంటి భిన్న కాంబోలో రావడంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. త్వరలోనే చిత్రంలోని ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలను మేకర్స్ తెలిజేస్తారు. పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న సిలంబరసన్ టీఆర్ ఇప్పుడు ‘అరసన్’గా వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలవనుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
క్రేజీ కాంబినేషన్‌లో ‘అరసన్’
- Advertisement -
- Advertisement -