కాంగ్రెస్ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: కే టీ ఆర్…
నవతెలంగాణ – బంజారా హిల్స్
ప్రజా పాలనలో హామీలు అమలు కావా? కాంగ్రెస్ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
సోమవారం బీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మద్దతుగా కేటీఆర్ ఆటో అన్నలతో కలిసి ఆటోలో ప్రయాణించారు. జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ ప్రజల సమస్యలను ప్రజల వద్దకే వెళ్లి వాటిని ప్రత్యక్షంగా తెలుసుకోవడం ద్వారానే పరిష్కారం సాధ్యమని నమ్ముతూ ముందుకు వెళ్తామని అన్నారు. కార్మికుల ఆవేదన, వారి జీవన స్థితిగతులు, పెరిగిన ఇంధన ధరలు, పర్మిట్ సమస్యలు, బీమా ఇబ్బందులు, మొదలగు సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ శాంతి యుత నిరసనకు ప్రభుత్వం స్పందించని పక్షంలో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.



