Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులకు పదోన్నతులు అటకెక్కినట్లేనా.?

ఉపాధ్యాయులకు పదోన్నతులు అటకెక్కినట్లేనా.?

- Advertisement -

– టిఎస్ జిహెచ్ఎంఏ నిజామాబాద్ జిల్లా   బాధ్యులు చౌడారపు రాంప్రసాద్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఉపాధ్యాయులకు ఎంఈఓ, జూనియర్ లెక్చరర్, డైట్ లెక్చరర్ల పదోన్నతులు అటకెక్కినట్లేనా? తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నిజామాబాద్ జిల్లా బాధ్యులు చౌడారపు రాంప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2001లో జూనియర్ లెక్ఛరర్ల  పదోన్నతులు, 2000 సంవత్సరంలో డైట్ లెక్ఛరర్ల పదోన్నతులు ఇచ్చారనీ పేర్కొన్నారు. మండల విద్యాధికారుల పదోన్నతులు చివరిసారిగా 2005లో ఇచ్చారన్నారు. దాదాపుగా ప్రతీ ఉపాధ్యాయుడు కనీసం 10 సంవత్సరాల సర్వీసు తర్వాత పదోన్నతి రావాలని ఆశిస్తారు, కాని కేవలం విద్యాశాఖలో మాత్రయే కేడర్ లో నియమితులైన ఉపాధ్యాయులు అదే క్యాడర్ లో పదవీ విరమణ  చెందుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై, ఇరవై ఐదు  సంవత్సరాలుగా అదే క్యాడర్ లో పనిచేస్తున్నారన్నారు.

రెవిన్యూ, పంఛాయితీ రాజ్ మొదలైన శాఖల్లో ఉద్యోగులు ఇరవై, ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసులో కనీసం 4 పదోన్నతులు పొందుతుండగా, విద్యాశాఖలో మాత్రం అసలే పదోన్నతులు పొందడం లేదన్నారు. వేలాది మంది ఉపాధ్యాయులు పదోన్నతులు వస్తాయేమో అన్న ఆశ తో లక్షలాది రూపాయలు ఖర్ఛు  ఛేసుకొని ఉన్నత విద్యా కోర్సులు ఎం.ఏ, ఎమ్మెస్సీ, ఎం.కాం, ఎం.ఎడ్,ఎంఫీల్, పీహెచ్డీ  చేశారనీ తెలిపారు. డైట్ కళాశాలలలో కనీసం 20 నుంచి 30 మంది ఉపన్యాసకుల పోస్టులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం తెలంగాణాలో కొన్ని డైట్ కళాశాలలలో ఒక్క ఉపన్యాసకుడు లేని పరిస్తితి ఉందన్నారు. మండల విద్యాధికారిలుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు   అదనపు బాధ్యతలు ఇవ్వడంతో వారు తలకు మింఛిన భారంతో సతమతమవుతున్నారని తెలిపారు. పాఠశాల బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించ లేకపోతున్నారన్నారు. విపరీతమైన పని ఒత్తిడితో రక్త పోటు, షుగర్ లాంటి వ్యాధులకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేసీఅర్ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ఉపాధ్యాయులకు కేవలం ఒకే పేజీ సర్వీసు రూల్స్ తయారు చేసుకొని అన్ని కేటగిరీల్లో ప్రతీ సంవత్శరం పదోన్నతులు ఇస్తారని ప్రకటించారని గుర్తు చేశారు.

కోర్టు కేసుల నెపంతో గత 20 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం ఇవ్వడం లేదన్నారు. 2018 రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి సర్వీస్ నిబంధనలకు ప్రకారం పదోన్నతులు ఇవ్వచ్చని తెలిపారు. ప్రస్తుతం జోనల్,జిల్లా క్యాడర్ల ఉపాధ్యాయుల విభజన పూర్తయినందున,  విద్యా శాఖ లోని వివిధ ఖాళీ పోస్టులకు డిప్యూటీవో, ఎంఈఓ, డైట్ లెక్చరర్  పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని ఉపాధ్యాయ వర్గం కోరుకుంటుందన్నారు. తద్వారా ఏర్పడిన ఖాళీలను నిరుద్యోగులకు డీయస్సీ ప్రకటించడం ద్వారా వారిని కూడా తృప్తిపరచవచని రాంప్రసాద్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -