- Advertisement -
హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో ఎలాంటి మొండి మరకల్ని కూడా ఈజీగా పోగొట్టొచ్చు. దీనికోసం ఏం చేయాలంటే.. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను బేకింగ్ సోడాతో 1:1 నిష్పత్తిలో కలపండి. ఈ మిశ్రమాన్ని స్పాంజ్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌ని ఉపయోగించి గోడలపై అప్లై చేసి కాసేపు అలాగే వదిలేయండి. కాసేపటి తర్వాత తడి గుడ్డతో తుడిస్తే గోడలపై ఎలాంటి మరకలైనా వదలాల్సిందే. బేకింగ్ సోడా స్క్రబ్బింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.పెరాక్సైడ్ బ్లీచింగ్‌లా పనిచేసి మరకల్ని సులభంగా పోగొడుతుంది. ఒకవేళ గోడలపై మరకలు లేకపోయినా ఈ కెమికల్‌ను స్ప్రే చేస్తే దుమ్ము, దూళి కూడా క్షణాల్లో వదలగొడుతుంది.
- Advertisement -



