– బీసీ విద్యార్థి,సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు.నీల నాగరాజు, సాప శివరాములు
నవతెలంగాణ – కామారెడ్డి
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి వైఖరిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పూలే విగ్రహం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేయడం జరిగిందనీ బీసీ విద్యార్థి సంఘం, సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,సాప శివరాములు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులపై రాజకీయ పార్టీల అధినేతలు ఎందుకు స్పందించడం లేదనీ, బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించక పోవడానికి కారణం బిజెపి నే,సుప్రీంకోర్టు తీర్పుతో నైనా రేపు సాయంత్రం లోగా బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని గవర్నర్ ఆమోదించాలి అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకపోతే రాష్ట్ర గవర్నర్ రాజీనామా చేయాలనీ ఉద్యమిస్తామన్నారు. రిజర్వేషన్లు అడ్డుకునే రెడ్లది ఆధర్మమైనది, బీసీల పోరాటం న్యాయమైనదన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలను ఇప్పటికైనా రెడ్లు విరమించుకోవాలి అని లేదంటే భవిష్యత్తులో బీసీలకు రాజకీయ శత్రువులుగా రెడ్లను ప్రకటిస్తాం అని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని రిజర్వేషన్ వ్యతిరేకులైన రెడ్డి జాగృతి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని, బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో వారు వేసిన పిటీషన్ ను కోర్టు డిస్మిస్ చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. బీసీ రిజర్వేషన్ లను అన్యాయంగా అడ్డుకోవాలని రెడ్డి జాగృతి చూస్తుంటే ప్రధాన పార్టీలైన బిజెపి, బిఆర్ఎస్ నాయకులు ఎవరు స్పందించడం లేదని, చిన్న చిన్న విషయాలకు స్పందించే పార్టీల అధినేతలు రెడ్డి జాగృతి చేస్తున్న ప్రయత్నాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో బిజెపి పార్టీ మొదటి నుండి రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తు, బిసిల విషయంలో డోకాబాయి చేస్తుందన్నారు. అసెంబ్లీలో మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి చట్టం ఆమోదం పొందే విషయంలో కనీసం ప్రయత్నించకపోవడం బీసీల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర గవర్నర్ ను ఒప్పించి ఒక్క రోజులోనే రిజర్వేషన్లు ఆమోదం పొందేలా చేయొచ్చని కానీ బిజెపి పార్టీ ఆ ప్రయత్నం చేయడం లేదంటే ఆ పార్టీకి బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ఇష్టం లేదని ఆయన ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్ల హైకోర్టు సుప్రీంకోర్టు లో స్టే ఇవ్వలేదని, హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులతో అయినా రాష్ట్ర గవర్నర్ ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ల చట్టాన్నీ ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర గవర్నర్ రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బీసీలు తినే కంచంలో మన్ను పోసినట్టు రెడ్డి జాగృతి నేతలు వ్యహరిస్తున్నారని, బీసీ రిజర్వేషన్ అడ్డుకొని భవిష్యత్తులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లు బీసీలకు రాజకీయ శత్రువులుగా మారోద్దని సూచించారు. రెడ్డి నేతలు చేస్తున్న పోరాటం అధర్మమైనదని బీసీలు చేస్తున్న పోరాటం ధర్మమైనదని ఇది గమనించాలని ఆయన కోరారు. బీసీ రిజర్వేషన్ల పట్ల రెడ్డి సమాజానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బీసీ రిజర్వేషన్ల పెంపు కు అండగా నిలబడి అసమానతలు లేని సమాజం రావడానికి వారు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మోహణాచారి, అబ్దుల్ అజీజ్, కొత్తపల్లి మల్లన్న, దయాకర్, వినోద్,రాజేందర్,రాజయ్య,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.