ప్రస్తుతం నడుం నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవన విధానం, వ్యాయామం తగ్గడం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా నడుం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. అయితే దీనికి చెక్ పెట్టేందుకు కొన్ని సహజ చిట్కాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
– నడుం నొప్పిని తగ్గించేందుకు ఐస్ ప్యాక్ బాగా ఉపయోగ పడుతుంది. నొప్పిగా ఉన్న ప్రదేశంలో ఐస్ ప్యాక్‌ను 20 నుంచి 25 నిమిషాల పాటు అప్లై చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. లేదంటే ఒక గుడ్డలో ఐస్ ప్యాక్స్ వేసుకొని రుద్దినా ఫలితం ఉంటుంది. అలాగే వేడి నీటి బాటిల్ లేదా హీట్ ప్యాడ్‌ను ఉపయోగించినా నొప్పి తగ్గుతుంది. బిగుసుకు పోయిన నరాలు సడలి నొప్పి తగ్గుతుంది.
– తులసి, అల్లం కూడా వెన్ను నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక అల్లం ముక్కను తీసుకొని నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం అల్లం నీటిలో తులసి ముక్కలను వేసుకొని వడగట్టి ఆ రసాన్ని తీసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఒళ్లు నొప్పులన్నీ దూరమవుతాయి.
– పసుపు కూడా వెన్ను నొప్పిని తగ్గించడంలో ఉపయోగ పడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం వాపును, నొప్పిని దూరం చేస్తుంది.
– ఇక ఉప్పు, ఆవాలతో మసాజ్ చేసుకున్న వెన్ను నొప్పి తగ్గుతుంది. నూనెలో ఆవాలను కొంచెం ఉప్పు వేసి వేడి చేయాలి. అనంతరం ఆ ఆయిల్‌ను నొప్పి ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కండరాల నొప్పి తగ్గుతుంది.
వీటన్నింటితో పాటు రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి.
నొప్పి వేధిస్తోందా?
- Advertisement -
- Advertisement -