Tuesday, July 29, 2025
E-PAPER
Homeమానవిఅజీర్తితో బాధపడుతున్నారా?

అజీర్తితో బాధపడుతున్నారా?

- Advertisement -

ఎక్కువ తిన్నా ఇబ్బందే.. తక్కువ తిన్నా ఇబ్బందే.. కారణం జీర్ణసంబంధిత సమస్యలు. తిన్న ఆహారం సరిగా జీర్ణం అయితే ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ, ప్రస్తుత కాలంలో చాలా వరకు జీర్ణ సంబంధిత సమస్యలతోనే సతమతం అవుతున్నారు. ఫలితంగా అజీర్తి, అసిడిటీ, మలబద్దకం, కడుపు ఉబ్బరం, గ్యాస్‌, గుండెల్లో మంట వంటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ.. ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అందుకే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే.. సెెలెరీని ఆహారంగా తీసుకోవడం వల్ల పొత్తికడుపు నొప్పి, గ్యాస్‌, వాంతులు, అజీర్తి, అసిడిటీ వంటి ఇతర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఒకవేళ మీరు అజీర్తితో బాధపడుతుంటే.. కేవలం సెలెరీ, నల్ల ఉప్పు, అల్లం కలిపి మెత్తగా నూరి, భోజనంతో తీసుకోండి.
మీ పొట్ట మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, పుదీనా టీ కూడా తాగవచ్చు. పుదీనాలో జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించే అనేక యాంటీ బాక్టీరియల్‌, క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. ఇది మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయ పడతాయి. పెరుగు తినడం ద్వారా కూడా ఉదర సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. పెరుగులో ప్రోబయోటిక్స్‌ ఉంటాయి. ఇది తినడం వల్ల అన్ని రకాల ఉదర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
పుచ్చకాయ చాలా ఆరోగ్యకరమైన పండు. దీనిలో ఉండే హైడ్రేటింగ్‌, యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు, విటమిన్లు, ఖనిజాలు ఉదర సంబంధిత సమస్యలను అధిగమించడానికి సహాయపడతాయి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -