Tuesday, July 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలు‘అర్జున్‌ చక్రవర్తి’ టీజ‌ర్ విడుద‌ల‌

‘అర్జున్‌ చక్రవర్తి’ టీజ‌ర్ విడుద‌ల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: విజయరామరాజు టైటిల్‌ రోల్‌ పోషించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘అర్జున్‌ చక్రవర్తి’. విక్రాంత్‌ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుండి హను రాఘవపూడి టీజర్‌ని విడుదలచేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో విజయరామరాజు మాట్లాడారు. ‘టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇది చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతమైన వర్క్‌ చేశారు. మ్యూజిక్‌. విజువల్స్‌ ఇవన్నీ కూడా నెక్స్ట్‌ లెవెల్‌లో ఉంటాయి. హీరోయిన్‌ సిజ్జా ఈ సినిమా కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేసింది’ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -