– నెపొమియాచిపై గెలుపు
– ఈస్పోర్ట్స్ వరల్డ్‌కప్
రియాద్ (సౌదీ అరేబియా) : రష్యా గ్రాండ్‌మాస్టర్ ఐయాన్ నెపొమియాచిపై తెలుగు తేజం అర్జున్ ఎరిగేశి మెరుపు విజయం సాధించాడు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరుగుతున్న ఈస్పోర్ట్స్ వరల్డ్‌కప్‌లో అర్జున్ ఎరిగేశి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. నాలుగు గేముల క్వార్టర్‌ఫైనల్లో నెపొమియాచిపై అర్జున్ 2.5-1.5తో పైచేయి సాధించాడు. తొలి గేమ్ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో నల్ల పావులతో ఆడిన అర్జున్ విజయం సాధించాడు. నెపొమియాచి మూడో గేమ్‌లో విజయం సాధించి మ్యాచ్‌ను నిర్ణయాత్మక నాల్గో గేమ్‌కు తీసుకెళ్లాడు. డిసైడర్‌లో అర్జున్ చురుగ్గా పావులు కదిపాడు. 41వ ఎత్తు తర్వాత నెపొమియాచి పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అర్జున్ ఎరిగేశి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. ఇరాన్ గ్రాండ్‌మాస్టర్ అలిరెజాతో అర్జున్ సెమీఫైనల్లో తలపడనున్నాడు. భారత మరో ఆటగాడు నిహాల్ సరిన్ 0.5-2.5తో ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ మాగస్ కార్ల్‌సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. రెండో సెమీస్‌లో కార్ల్‌సన్, హికారు నకమురు పోటీపడతారు.
సెమీస్‌కు అర్జున్
- Advertisement -
- Advertisement -