- Advertisement -
న్యూఢిల్లీ : భారత గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ దక్షిణాఫ్రికాలోని గ్రూట్‌బోస్ ప్రైవేట్ నేచర్ రిజర్వ్‌లో జరుగుతున్న ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ రౌండ్- రాబిన్ దశలో ప్రపంచ దిగ్గజం మాగస్ కార్ల్‌సన్‌ను ఓడించి సంచలనం స ష్టించాడు. మొత్తం ఏడు రౌండ్లు ముగిసేసరికి అర్జున్ 4.5 పాయింట్లతో పట్టికలో మూడవ స్థానంలో నిలిచి నాకౌట్ చేరుకున్నాడు. ఎరిగైసి కంటే ముందు, ఫిడే ప్రపంచ కప్ విజేత జవోఖిర్ సిందరోవ్ (5.5 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా, లెవోన్ అరోనియన్ (5 పాయింట్లు) రెండవ స్థానంలో నిలిచాడు. నాకౌట్ మ్యాచ్‌లో అర్జున్.. విన్సెంట్ కీమర్‌తో తలపడనున్నాడు.
- Advertisement -



