- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మయన్మార్‌లో ఉద్రిక్తతలు ఉధృతమయ్యాయి. పశ్చిమ రఖైన్‌లోని మ్రౌక్ యు టౌన్‌షిప్ ఆస్పత్రిపై సైన్యం బుధవారం అర్థరాత్రి ఎయిర్ స్ట్రైక్ నిర్వహించగా.. ఇప్పటి వరకూ 31 మంది మృతి చెందారు. 70 మంది గాయపడ్డారు. ఆస్పత్రి పూర్తిగా ధ్వంసమైంది. 2021లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత దేశంలో హింస కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 28 నుంచి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందే సైన్యం దాడులు పెంచినట్టు సమాచారం. కాగా, జనవరి–నవంబర్ మధ్య 2,165 వైమానిక దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
- Advertisement -



