Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మెడికవర్ ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ ట్రస్టు తనిఖీలు 

మెడికవర్ ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ ట్రస్టు తనిఖీలు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో గల మెడికవర్ ఆస్పత్రిని ఆరోగ్య శ్రీ ట్రస్టు అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం మెడికవర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ జీఎం డా.రాంబాబు నాయక్ ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ ట్రస్టు సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ లో జరుగుతున్న వైద్యంలో ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెడికవర్ లో ఆరోగ్య శ్రీ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో డిప్యూటీ ఈఓ శ్రీనివాస్, చంద్రశేఖర్, మేనేజర్ ఆర్. సత్యనారాయణ, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -