నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని 32 గ్రామ పంచాయతీ లకు గాను 4 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. 28 గ్రామాల్లో పురుషులు 18 ,359,స్త్రీ లు 21,156.ఇతరులు 1 .మొత్తం 39516 మంది ఓటర్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఓటును వినియోగించనున్నారు. రెండవ విడత సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాటు చేసినట్లు శనివారం మండల ఎన్నికల అధికారి ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు తెలిపారు. మండల కేంద్రంలో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం లో 250 పోలింగ్ స్టేషన్ లకు పి.ఓ, ఒపి.ఓ లకు ఎన్నికల సామాగ్రి బ్యాలెట్ బాక్స్, పేపర్స్,ఇంక్ బాటిల్,ఓటర్ లిస్టు,కంపాడ్ మెంట్ బాక్స్ లను అంతజేశారు. అంతరం ఎన్నికల సిబ్బంది పోలింగ్ స్టేషన్ లకు తరలి వెళ్లారు.
ఆదివారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1గంట వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలు ఉంటుందని వెలిపారు. ఈ ఎన్నికలకు 250 పోలింగ్ స్టేషన్ కు 28 ఆర్.ఓ లు,250 పి ఓ లు300 మంది ఓపిఓ లు,ముగ్గురు జోనల్ అధికారులు,10 మంది రూట్ ఆఫీసర్, ఐదుగురు మైక్రో అబ్జర్వర్స్,వెబ్ కెమెరా ఆపరేటర్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈ ఏర్పాట్లు మండల ఉన్నత అధికారులు తహశీల్దార్ సంధ్యారాణి, ఎంపి ఓ అమీర్ ఖాన్ ప్రత్యేక అధికారి బాలిగ్ అహ్మద్, ఏవో వికార్ అహ్మద్ లు పర్యవేక్షించారు.



