Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూడవ విడత సర్పంచ్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి.!

మూడవ విడత సర్పంచ్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి.!

- Advertisement -

మండల ఎంపీడీవో క్రాంతి కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు

స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మండల ఎంపీడీవో క్రాoతి కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 46 పోలింగ్ స్టేషన్లో 17న బుధవారం ఎన్నిక జరగనున్నట్లుగా తెలిపారు. మండల వ్యాప్తంగా 13 సర్పంచ్ స్థానాలకు,102 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఐదుగురు రూట్ ఆఫీసర్లు ఐదుగురు జోనల్ ఆఫీసర్లు వందమంది మంది పోలింగ్ సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందన్నారు.

ఉదయం 7 గంటల నుండి ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని, లంచ్ చేసిన తర్వాత రెండు గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయి సాయంత్రానికి ఫలితాలు వెలువడతాయని అన్నారు. పూర్తి చేసి రిటర్నింగ్ అధికారులు పూర్తి సమాచారం అందిస్తారని అన్నారు. 15 పంచాయతీల పరిధిలో చిన్నతూండ్ల, దుబ్బపేట సర్పంచ్ లతోపాటు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందని వెల్లడించారు. అదేవిధంగా 128 వార్డులకు గాను 26 ఏకగ్రీవం కాగా 102 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -