పట్టుకున్న నిజామాబాదు పోలీసులు
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్ : 24 కేసులలో నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ ఉన్నా..మళ్ళీ నేరాలు చేస్తూ..బయట తిరుగుతున్న నేరస్థుడని నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నటువంటి నాందేడ్ జిల్లా దేగ్లూర్ కు చెందిన బబ్లు బాలాజీ గైక్వాడ్ అలియాస్ ధన్ల బాబు ఇప్పటికీ ఏమార్పు లేకుండా మళ్ళీ నేరాలు చేస్తూ.. పోలీసులకు చిక్కకుండా నేరాలు చేస్తూ తిరుగుతున్నారు. ఇతని కోసం పోలీసులు గత కొన్ని సంవత్సరాలుగా ఎంత గాలించినా చిక్కడం లేదు. అయితే శుక్రవారం ఈ నేరస్తుడు నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో నేరాలు చేయడానికి తిరుగుతున్నట్లు కమిషనర్ కు సమాచారం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కమిషనర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు చాకచక్యముగా పట్టుకొని కామారెడ్డి పోలీసు వారికి అప్పగించినట్లు తెలిపారు. ఈ నేరస్తుని పట్టుకోవడంలో నిజామాబాద్ సిసిఎస్ ఏసిపి కె. నాగేంద్ర చారి , సిసిఎస్ సీ.ఐ సురేష్, సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నేరస్తుని చాకచక్యంగా పట్టుకున్న బృందానికి పోలీస్ కమిషనర్ అభినందనలు తెలిపారు.
నాన్ బెయిల్ వారెంట్ నేరస్తుడి అరెస్టు ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES