Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీపీఐ(ఎం) నాయకుల అరెస్టు 

సీపీఐ(ఎం) నాయకుల అరెస్టు 

- Advertisement -

– గద్వాల పోలీస్ స్టేషన్ కు తరలింపు 
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
: సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన సంఘటన శుక్రవారం గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. బీసీ రిజర్వేషన్ లకు చట్టభద్ధత కల్పించాలని, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని, బీసీ రిజర్వేషన్ లపై బీజేపీ ద్వంద వైఖరిని నిరసిస్తూ శుక్రవారం సీపీఐ(ఎం) చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా  శుక్రవారం ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహని పోలీసులు అరెస్ట్ చేసి గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -