Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటు హక్కు వినియోగంపై కళాకారుల అవగాహన

ఓటు హక్కు వినియోగంపై కళాకారుల అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2వ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో, ప్రజల్లో ఓటు హక్కు వినియోగంపై మండలం కొయ్యుర్ లో అవగాహన కల్పించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టి.ఎస్.ఎస్. కళాకారులు కళాజాత కార్యక్రమాలు నిర్వహించారు. కళాజాతల ద్వారా ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, స్వచ్ఛమైన–స్వేచ్ఛ గా  ఎన్నికలలో ప్రతి ఓటరు భాగస్వామ్యం ఎంతో కీలకమని సందేశాన్ని అందించారు. ప్రతి అర్హత ఉన్న పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చాలి. ఎన్నికలను నిర్దిష్ట నియమావళి ప్రకారం శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  తెలిపారు.

 ప్రతి ఓటరు తమ ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా  వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కళాజాత ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధిలో,సెగ్గం శిరీష,జాడి సుమలత,పులి రాధిక,ఆత్మకూరు మహేందర్,కమ్మల ప్రవీణ్ కుమార్,గడ్డం నాగమణి,కాస స్వాతి,చిలుముల మధుబాబు,ఓనపాకల కుమార్,సోదరి సురేందర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -