No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeరాష్ట్రీయంఆరుద్ర సాహిత్యం జనహితం

ఆరుద్ర సాహిత్యం జనహితం

- Advertisement -

– తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆరుద్ర సాహిత్యం జనహితాన్ని ప్రతిబింబిస్తుందని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంహెచ్‌భవన్‌లో తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆరుద్ర శతజయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సీనియర్‌ కవి, రచయిత సత్యభాస్కర్‌, ఆనందాచారి, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనందాచారి మాట్లాడుతూ… కవి, రచయిత, అనువాదకుడు, గేయరచయిత, నాటకకర్త, ప్రచురణకర్త, తెలుగు సాహిత్య నిపుణుడు అయిన ఆరుద్ర, తన రచనల ద్వారా సామాన్యులను, ప్రజాసామాన్యాన్ని ప్రభావితం చేశారని తెలిపారు. ఆయన అభ్యుదయ రచయితగా ఉంటూ ప్రజల జీవితాలను ప్రతిబింబించే రచనలు చేశారని గుర్తుచేశారు. ఆయన సూచించిన అభ్యుదయబాటలోనే నేడు తెలంగాణ సాహితి ప్రయాణిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంతోజు మోహన్‌కృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి సలీమ, రంగారెడ్డి జిల్లా నాయకులు, సీనియర్‌ కవి, రచయిత బండి సత్తన్న, హైదరాబాద్‌ నగర కార్యానిర్వహక కార్యదర్శి శరత్‌ సుదర్శి, నాయకులు సయ్యద్‌ ముజాహిద్‌ అలీ, అజరు, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad