Friday, December 5, 2025
E-PAPER
Homeసినిమాక్రిస్మస్‌ కానుకగా..

క్రిస్మస్‌ కానుకగా..

- Advertisement -

వైవిధ్యమైన చిత్రాలను ఓవర్సీస్‌ ప్రేక్షకులకు అందించే లక్ష్యంగా అడుగులేస్తున్న డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అథర్వణ భద్రకాళి పిక్చర్స్‌ మరో డిఫరెంట్‌ మూవీతో మెప్పించటానికి సిద్ధమవుతోది.
సామాజిక స్పృహతో రూపొందిన ‘దండోరా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. క్రిస్మస్‌ కానుకగా ఈనెల 25న ఈ చిత్రం గ్రాండ్‌ రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఈనెల 23న ప్రీమియర్స్‌తో భారీ స్థాయిలో ఓవర్సీస్‌లో విడుదల చేస్తున్నారు. నేషనల్‌ అవార్డ్‌ గెలుచుకున్న చిత్రం ‘కలర్‌ ఫోటో’..బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న ఈ సినిమాలో శివాజీ, నవదీప్‌, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్‌ దర్శకత్వం వహించారు. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -