Wednesday, July 30, 2025
E-PAPER
Homeసినిమాదీపావళి కానుకగా..

దీపావళి కానుకగా..

- Advertisement -

హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న రొమాంటిక్‌ డ్రామా చిత్రం ‘తెలుసు కదా’. స్టైలిస్ట్‌ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవు తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘మల్లికా గంధ’ను మల్లారెడ్డి ఉమెన్స్‌ కాలేజీలో మేకర్స్‌ ఘనంగా లాంచ్‌ చేశారు. ఇదొక లవ్‌, మ్యూజికల్‌ మ్యాజిక్‌తో మనసును తాకే అద్భుతమైన పాట. తమన్‌ కంపోజిషన్‌ బ్రిలియంట్‌గా ఉంది. సిద్‌ శ్రీరామ్‌ వాయిస్‌లోని ఇంటెన్సిటీ పాటకి ఓ ప్రత్యేక స్టయిల్‌ని తీసుకొచ్చింది. దర్శకురాలు నీరజా కోన, సినిమాటోగ్రాఫర్‌ జ్ఞాన శేఖర్‌ వి.ఎస్‌ కలసి ప్రేమ ప్రపంచాన్ని తెరపై అద్భుతంగా మలిచారు. ప్రతీ ఫ్రేమ్‌ విజువల్‌ ఫీస్ట్‌లా ఉంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా కెమిస్ట్రీ సాంగ్‌కు మరింత బ్యూటీని యాడ్‌ చేశాయి. లవ్‌, మ్యూజికల్‌ సెలబ్రేషన్స్‌కు ఇది పర్ఫెక్ట్‌ సాంగ్‌గా నిలుస్తుంది. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 17న ఈ సినిమా విడుదల కానుంది అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -