– ఉత్సవంలో పాల్గొన్న పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
– కుల మతాలకు అతీతంగా పీర్లను ఎత్తిన యువత
నవతెలంగాణ – రాయపర్తి
త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం ఉత్సవాని కాట్రపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అసై దూల హారతి అంటూ పీర్ల చావడీల వద్ద యువత చిందులు వేశారు. సోమవారం ఉత్సవం చివరి రోజు కావడంతో ముస్లిం సోదరులు నిర్వహించిన మొహర్రం పండుగ వాతావరణంతో గ్రామంలో కోలాహలం నెలకొంది. బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఉత్సవంలో పాల్గొన్నారు. దీంతో ముస్లిం పెద్దలు ఆయనకు పూలదండలతో ఘనంగా ఆహ్వానించారు.
శ్రీనివాస్ రెడ్డి భక్తిశ్రద్ధలతో పీర్లకు దట్టీలు అసమర్పించారు. గ్రామంలో అసరఖానా నిర్మాణానికి తమ వంతు కృషి చేయడం సంతోషకరమని తెలిపారు. తదుపరి డప్పు చప్పుళ్ళు, బ్యాండు దరువులతో పీర్ల పండుగ కొత్త పుంతలు తొక్కింది. చివరి వరకు సాగిన పీర్ల (సవార్ల) ఊరేగింపు చెరువు వద్దకు చేరుకుంది. చిల్పేర్ పేరుతో పిర్లను (సవార్లను) చెరువులో నిమజ్జనం చేశారు. ఫాతియా ఇచ్చి ముస్లిం సోదరులు విషాద గేయాలను ఆలపిస్తూ ఇండ్లకు చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ప్రతినిధులు గజావెల్లి ప్రసాద్, ఎండీ యూసఫ్, ట్రస్ట్ కోఆర్డినేటర్స్ ఉబ్బని సింహాద్రి, సంకినేని ఎల్లస్వామి, నాయకులు ఎండి అన్వర్, పెద్దగోళ్ళ రాజ్, పోగులకొండ వేణు, కుంట రాంబాబు, చందు రామ్, చందు సతీష్, చిలువేరు సాయి గౌడ్, బల్లెం యాదగిరి, చందు లక్ష్మన్, గారె నరేష్, గుమ్మడిరాజ్ శ్రీనివాస్, కత్తి సోమన్న, చెన్నబోయిన యాకయ్య, ఎండీ నజర్, ఎండీ ఖలీల్, ముద్రబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కాట్రపల్లిలో హోరెత్తిన అసై దూల హారతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES