Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా ఆశా డే

కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా ఆశా డే

- Advertisement -

జిల్లా వైద్యాధికారి గోపాలరావు
నవతెలంగాణ – తాడ్వాయి 
: మండలంలోని లింగాల గ్రామపంచాయతీ పరిధిలో గల కోడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఆశా డే నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్యాధికారి గోపాలరావు హాజరై మాట్లాడారు. గ్రామాలలో ఆశాలు అవగాహన ద్వారా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు తీసుకోవాలని పిలుపునిచ్చారు. రక్తపోటు మధుమేహం క్యాన్సర్ లాంటి పరీక్షలు వాటి ప్రాముఖ్యతను వివరించి నాలుగో విడత స్క్రీనింగ్ పరీక్షలకు అందరూ హాజరయ్యేటట్లు చూడాలని అన్నారు. ఎండలు విపరీతంగా పడుతున్నందున వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలు తెలియపరచాలని, ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. జాతీయ టీబీ నియంత్రణలో భాగంగా ప్రతి ఆశా కార్యకర్త విధిగా 10 తెమడ పరీక్షలు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్స్ పద్మ, బాలు నాయక్, ఆరోగ్య కార్యకర్త సీతారాం నాయక్ ల్యాబ్ టెక్నీషియన్ పండు, ఫార్మసిస్ట్ వెంకట్ ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img