- Advertisement -
నిరాశ కమ్ముకున్న ప్రతి సారి
ఎక్కడో ఒక దగ్గర
ఆశా రేఖ తళుక్కున మెరుస్తుంది
అది ట్రంపోన్మాదాన్ని
ధిక్కరించిన న్యూయార్క్ గానో
మతోన్మాదాన్ని ఊడ్చేసిన జె.ఎన్.యు గానో
ఐక్యతను చేతల్లో చూపిన
నేపాల్ రెడ్ షర్ట్స్ గానో
తటిల్లున మిరుమిట్లు గొలుపుతుంది
ఆ వెలుగు రేఖలో కమ్మిన నిరాశ
వెనక పట్టు పడుతుంది
ఆలోచనల్ని సరి చూసుకొని
హదయాన్ని శతి చేసుకొని
అభ్యుదయ గానాన్ని ఆలపిస్తాను
వసంత మేఘాలు మళ్ళీ ఘర్జిస్తాయని
ఆకు రాల్చిన వనాలు
బంజరు భూములు చిగురిస్తాయని
విశ్వాసాన్ని ప్రకటిస్తూ
సమరాంగణానికి సన్నద్ధ మవుతాను
- వి.ఆర్. తూములూరి, 9705207945
- Advertisement -


