Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశా వర్కర్ల అధ్యక్ష కార్యదర్శులు ఏకగ్రీవం

ఆశా వర్కర్ల అధ్యక్ష కార్యదర్శులు ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు : మునుగోడు మండల ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు మండల అధ్యక్ష , కార్యదర్శి గా వి నిర్మల, ఎం కవితను సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు సమక్షంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్మల, కవిత మాట్లాడుతూ .. ఆశ వర్కర్లకు స్థిర కనీస వేతనం నెలకు 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లను మూడవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు , 20 రోజుల క్యాజువల్ సెలవులు, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు నిర్ణయించాలని అన్నారు.

ఆశ వర్కర్లకు పెన్షన్ , ఇతర సామాజిక భద్రత ప్రయోజనాలను కల్పించాలని డిమాండ్ చేశారు. తమ నియామకానికి సహకరించిన తోటి ఆశా వర్కర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు వారితోపాటు ఎన్నికైన వారు అధ్యక్షురాలు గా ఏ కమల , ఎం పుష్ప , కోశాధికారిగా ఎం లక్ష్మి కమిటీ సభ్యులుగా ఎన్ లింగమ్మ , వి కమల , పి మమత , జి వసంత, పి నాగమణి , పి జ్యోతి , జె ఇంద్ర , ఎస్ సుజాత , ఎం ధనలక్ష్మి , వి లక్ష్మి, ఎన్ జ్యోతి , జి ధనమ్మ, ఈ మమత , డి రాణి, డి ధనలక్ష్మి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఎం మండల కమిటీ సభ్యులు వేముల లింగస్వామి , యాట యాదయ్య తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -