మూడు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న అదనపు వేతనాలు చెల్లించాలి
నవతెలంగాణ – కన్నాయిగూడెం
కన్నాయిగూడెం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రంలో లేప్రసి సర్వే చేయాలని ఆశా వర్కర్లను అన్ని జిల్లాలలో ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశిస్తున్నారు. ప్రజలకు సేవలు అందించడానికి ఆశా వర్కర్లు నిరంతరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. కానీ లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లిస్తారా? లేదా ?అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని జిల్లాలలో ఆశాలకు డబ్బులు చెల్లించాలని పైనుండి మాకు ఆదేశాలు రాలేదనిఅధికారులు అంటున్నారు.
మరికొందరు అధికారులు మీరు సర్వేలు చేయండి తర్వాత చూస్తామంటున్నారు. ప్రతి సంవత్సరం ఇలానే డ్యూటీలు చేస్తున్నాము కానీ గత మూడు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ అదనపు డబ్బులు రావట్లేదని ఆశాలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అదనపు వేతనాలు చెల్లించకుండా ఆశలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తుందనిఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిత్యవసర సామాన్లకు అధిక రేట్లు పెరిగాయని ఆశ వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని కనీస వేతనం రూ.18000 ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆశ వర్కర్లు పాల్గొనడం జరిగింది.



