Monday, March 16, 2026
E-PAPER
Homeఖమ్మంఆశ వర్కర్లకు రూ. 18,000 వేతనం నిర్ణయించాలి 

ఆశ వర్కర్లకు రూ. 18,000 వేతనం నిర్ణయించాలి 

- Advertisement -

సీఐటీయూ మండల కన్వీనర్ గుగులోత్ నరేష్ 
నవతెలంగాణ – బోనకల్ 
ఆశా వర్కర్లకు నెల వేతనం రూ .18,000గా నిర్ణయించాలని సిఐటియు మండల కన్వీనర్ గుగులోత్ నరేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు తమ సమస్యల పరిష్కరించాలని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనం పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని సీఐటీయూ మండల కన్వీనర్ గుగులోత్ నరేష్, ఆశా వర్కర్ యూనియన్ మధిర డివిజన్ కార్యదర్శి రామణ సరోజిని విమర్శించారు.

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్లు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. స్వయంగా ప్రభుత్వమే ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోతే ఎవరు అమలు చేస్తారని వారు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆశా వర్కర్ల ఆందోళన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చిందన్నారు. అవి కూడా అమలు చేయడం లేదన్నారు.

కనీసం వేతనాలు కూడా నేటి వరకు పెంచలేదని విమర్శించారు. రూ. 50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50,000 మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చారన్నారు. పిఆర్సి, ఏరియాస్ లెఫ్రిస్, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నాయన్నారు. వీటికి తోడు పారితోషకాలు కూడా ప్రతి నెల రావట్లేదన్నారు. దీంతో ఆశా వర్కర్లు అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వీటన్నిటిని పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఆశా వర్కర్ యూనియన్ నాయకులు మరీదు లీలా కుమారి, నాగనబోయిన రమాదేవి, గుడిద ఉషారాణి, గంగుల విజయలక్ష్మి, వంగల దుర్గ, గద్దె తులసి, ఇరుగు యశోద, కన్యపోగు వెంకటరమణ, ఎస్ విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -