Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలో ఆషాఢం గోరింటాకు వేడుక

ప్రభుత్వ పాఠశాలలో ఆషాఢం గోరింటాకు వేడుక

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలోని మండల ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం ఆషాఢ మాసం సంబరాలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా పాఠశాలలో గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలే స్వయంగా గోరింటాకును తెచ్చి ఒకరి చేతులకు ఒకరు విద్యార్థినిలు పెట్టుకున్నారు. పాఠశాలలోని విద్యార్థినిలు గోరింటాకు పెట్టుకొని చాలా ఆనందంతో మురిసిపోయారు. ఈ సందర్భంగా  పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, ఆషాఢమాస ప్రాముఖ్యతను మన వచ్చే తరం పిల్లలకి తెలియజేయాలని ఉద్దేశంతో పాఠశాలల  ఆషాడ మాసం గోరింటాకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. గోరింటాకు కార్యక్రమాన్ని ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు కలిసి సంబరంగా జరుపుకున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పసుపుల ప్రసాద్, సరిత, పరశురాం, సంధ్య, నిఖిత, సంజన, నగ్మా, సుప్రియ, అప్సాన, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -