Thursday, August 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనాలుగు వారాల గడువు కోరడం దారుణం

నాలుగు వారాల గడువు కోరడం దారుణం

- Advertisement -

మానవ హక్కుల కమిషన్‌పై పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు గౌరవం లేదా?
మాజీ సర్పంచుల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి : సర్పంచుల జేఏసీ అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మాజీ సర్పంచులకు పెండింగ్‌ బిల్లుల విడుదల జాప్యం ఫిర్యాదుపై విచారణకు రావాలని మానవ హక్కుల కమిషన్‌ ఆదేశిస్తే పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నాలుగు వారాల గడువు కోరడం దారుణమని తెలంగాణ సర్పంచుల సంఘాల జేఏసీ అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్‌ విమర్శించారు. మాజీ సర్పంచులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ బిల్లులపై ఈ నెల రెండో తేదీన మాజీ సర్పంచులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన విషయం విదితమే. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ బుధవారం విచారణకు రావాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ను, సర్పంచుల సంఘాల జేఏసీని గతంలోనే ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుర్వి యాదయ్య గౌడ్‌, కేశ బోయిన మల్లయ్య, నెమలి సుభాష్‌ గౌడ్‌, మన్నె పద్మారెడ్డి, సముద్రాల రమేష్‌ , అల్లంపల్లి తిరుపతిరెడ్డి తదితరులు హెచ్‌ఆర్‌సీ ఎదుట విచారణకు హాజరు కాగా…పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నాలుగు వారాల గడువు కావాలని కోరుతూ గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదయ్యగౌడ్‌ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటిపోయినా ఇంకా పెండింగ్‌ బిల్లులు విడుదల చేయక పోవడం దారుణమన్నారు. నెలరోజుల్లో క్లియర్‌ చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. మాజీ సర్పంచుల పట్ల రాష్ట్ర సర్కారు కక్షపూ రితంగా వ్యవహరించడం తగదన్నారు. బిల్లులు రాక మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -