Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పరీక్షలను వాయిదా వేయాలి 

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పరీక్షలను వాయిదా వేయాలి 

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
సర్పంచ్ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పరీక్షలు పెట్టారని వెంటనే ఈ పరీక్షలు వాయిదా వేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కు విజ్ఞప్తి చేశారు. ఈనెల 14న రెండో విడత పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయని అదే రోజు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ఏపీపీ రాత పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.ఎన్నికల రోజే పరీక్షలు ఉన్నందున వేలాది మంది గ్రామీణ ప్రాంత న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పరీక్షలను ఆపేసే విధంగా చర్యలు తీసుకోవాలని  కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -