నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన సుధాకర్ వాళ్ళ అక్క ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారిది నిరుపేద కుటుంబం, ఆమెకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ముగ్గురు చదువును కొనసాగించాలని దానికి కావలసిన సహకారాలు అందిస్తానని ఆ కుటుంబానికి ముత్యాల సునీల్ కుమార్ భరోసా ఇచ్చారు.
గ్రామానికి చెందిన ఏనుగు మోహన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకు న్నారు. గ్రామానికి చెందిన బాడకల గంగారం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఆయన వెంట కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు పిల్లల చదువుకు సహకారం అందిస్తానని భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES