నవతెలంగాణ – చండూరు
స్థానిక పాఠశాల గీతావిద్యాలయంలో బుధవారం (నమూనా ఎన్నికలు) mock election నిర్వహించడం జరిగింది. ఎన్నికలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు పాఠశాలను ఒక గ్రామంగా భావించి తరగతులను వార్డులుగా విభజించుకుని వార్డుకు కొద్ది మంది చొప్పున అభ్యర్థులు వార్డు మెంబర్లుగా , సర్పంచులు గా ప్రాతినిధ్యం వహించారు.
ఎన్నికలలో భాగంగా మొదటి రోజున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబడింది. రెండవ రోజు నామినేషన్ స్వీకరణ, అభ్యర్థులను ఎంపిక చేసి గురుతులను కేటాయించారు. వార్డు మెంబర్ అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు ప్రచారంలో భాగంగా అనేక రకాల హామీలతో ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల హామీలు ఇచ్చి వారి మనసులను గెలుచుకునే ప్రయత్నం చేశారు.
మూడవ రోజు ప్రశాంతమైన వాతావరణంలో ( విద్యార్థి) పోలీస్ పర్యవేక్షణలో ఓటర్ స్లిప్పులు ఆధార కార్డు గుర్తింపులతో వచ్చి బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో వారి వారికి కేటాయించిన పోలింగ్ బూతులలో ఓట్లు వేసి వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓట్ల లెక్కింపు చేసి గెలిచిన అభ్యర్థులను ప్రకటించి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. బాధ్యతాయుత పౌరులుగా నిలబడి సమాజాన్ని ముందుకు నడిపించడానికి రానున్న రోజులలో ఉత్తమ పౌరులుగా మెలుగుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్ పోలోజు నరసింహ చారి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని సమ సమాజ నిర్మాణంలో రేపటి రోజులలో మీరందరూ ముందుండి అవినీతి రహిత , పారదర్శకత తో సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని పాఠ్యాంశాలతోపాటు లాంటి కార్యక్రమాలు విద్యార్థుల మేదస్సుకు తోడ్పాటు అందిస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గా పోలోజు శ్రీనిధి, జిల్లా ఎస్పీగా శ్రీనాథ్, రిటర్నింగ్ ఆఫీసర్ గా ముంజంపల్లి శివ లీల, ఆర్డీవోగా తేలుకుంట్ల లహరి, సర్పంచులుగా సంకోజు జ్యోత్స్న, పల్లె జాహ్నవి, కాటం వైష్ణవి, తమ్మడ బోయిన సిద్దు, సిద్ది భవాని శంకర్, చిలుకూరి అజయ్ పాల్గొనగా, తమ్ముడు పోయిన సిద్దు సర్పంచిగా గెలుపొందాడు.
వార్డు అభ్యర్థులుగా 44 మంది పోటీలో పాల్గొన్నారు. వీరీలో వార్డ్ మెంబర్స్ గా మొదటి వార్డ్ బద్రేష్ సoగేపు రెండో వార్డ్ సారిక పెందోట , గౌతం కృష్ణ , రాచూరి వర్షిత్, రామ్ చరణ్ కాటం, కౌశిక్ సంగెపు, సుజిత్ కురిపాటి , భువన శ్రీ నాగిళ్ల, హారిక భూతరాజు, తేజేశ్వర్ పసుపులేటి, చందు జింకల గెలుపొందారు.ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.



