Friday, July 11, 2025
E-PAPER
Homeబీజినెస్ATGC Biotech : ఏటీజీసీ బయోటెక్ కు 'ఇన్నోవేషన్ లీడర్షిప్ అవార్డు 2025'

ATGC Biotech : ఏటీజీసీ బయోటెక్ కు ‘ఇన్నోవేషన్ లీడర్షిప్ అవార్డు 2025’

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: భారతీయ వ్యవసాయ ఆవిష్కరణలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏటీజీసీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రతిష్టాత్మక ‘ఇన్నోవేషన్ లీడర్షిప్ అవార్డు 2025’ లభించింది. న్యూఢిల్లీలో ‘అగ్రికల్చర్ టుడే’ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘అగ్రికల్చర్ లీడర్షిప్ కాన్క్లేవ్’లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సదాశివం అధ్యక్షతన గల జాతీయ అవార్డుల కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఐపీ-ఆధారిత, బయోఈ3-అలైన్డ్ బయోమ్యానుఫ్యాక్చరింగ్లో ఏటీజీసీ చూపిన మార్గదర్శక పాత్రను ఇది గుర్తిస్తుంది. సింథటిక్ బయాలజీ, మెటీరియల్ సైన్స్ ఆధారంగా అల్ట్రా-లో-డోస్, నీరు లేని, అవశేష రహిత పంట సంరక్షణ దిశగా సంస్థ సాధించిన పరివర్తనాత్మక పురోగతిని ఇది స్పష్టం చేస్తుంది. 26 పేటెంట్లు, 50కి పైగా వాణిజ్య దశలో ఉన్న ఉత్పత్తులతో ఏటీజీసీ భారతదేశాన్ని ప్రపంచ బయోటెక్నాలజీ శక్తి కేంద్రంగా, వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయంలో బయోఈ3-కంప్లైంట్ గా మారుస్తోంది.

అవార్డు అందుకుంటున్న సందర్భంగా ఏటీజీసీ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ మార్కండేయ గొరంట్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వి.బి. రెడ్డి మాట్లాడుతూ… “ఈ అవార్డు భారతీయ సైన్స్ సామర్థ్యాన్ని చాటి చెబుతోంది. డీప్-టెక్ ఆవిష్కరణను గౌరవించిన అగ్రికల్చర్ టుడేకు, మా ప్లాట్ఫామ్ను బెంచ్ నుండి ఫీల్డ్కు, గ్రాముల నుండి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన బీఐఆర్ఏసీ, డీబీటీ, డీఎస్టీ సంస్థలకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు. 2024లో ప్రపంచ ఆర్థిక ఫోరం… బియ్యం, పత్తి వంటి పంటలలో ఫెరోమోన్ టెక్నాలజీని విస్తరించడానికి ఏటీజీసీని ప్రపంచ కేస్ స్టడీగా హైలైట్ చేసింది.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -