Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు సన్మానం 

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గుర్రం కృష్ణ అధ్యక్షులు కొమురయ్య కార్యదర్శి మీరు వహాజ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించి సహర్ష్ రెడ్డి , శివశ్మిక , అధ్య , శీతల్, మహీన్ ఫిర్దోస్ , సంజన, రాం నాయక్, వర్షిణి బంగారు పతకాలు సాధించారు. మయాంక్ తేజ్, స్వరిత్ తేజ్ , స్వాతి శ్రీ, రాం నాయక్ లు సిల్వర్ మెడల్ సాధించారు. వర్ధన్, అక్షోభ్య, వర్షిణి, అస్మిత , వేద శ్రీ, అద్విత లు బ్రాంజ్ మెడల్ సాధించారు . ఈ సందర్భంగా జిల్లా తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ రమేష్ పవర్ అధ్యక్ష కార్యదర్శులు అజ్మత్ ఖాన్, వినోద్ నాయక్ ల ఆధ్వర్యంలో నగరంలోని క్యూరియస్ టైక్వాండో అకాడమీలో రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఘనంగా సన్మానించారు.

అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో మెడల్స్ సాధించి జిల్లా కీర్తిని చాటిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. క్రీడలు మానసిక దృఢత్వం తో పాటు చదువులో రాణించడానికి తోడ్పడతాయని ఉద్యోగాలలో సైతం క్రీడా కోటా క్రింద 2% మినహాయింపు ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించి పథకం సాధించిన క్రీడాకారులు నిరాశ చెందకుండా త్వరలో జిల్లా తైక్వాండ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే జిల్లా స్థాయిలో రాణించి తమ సత్తా చాటాలని కోరారు. రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి మెడల్స్ సాధించి జిల్లా అసోసియేషన్ కు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా వీళ్లను తర్ఫీదునిచ్చి మెడల్ సాధించేలా కృషిచేసిన కోచ్ వినోద్ నాయక్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ వినోద్ నాయక్ సీనియర్ క్రీడాకారులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -