Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మకూర్‌ ప్రజా సేవ కోసం ముందుండి పనిచేస్తా

ఆత్మకూర్‌ ప్రజా సేవ కోసం ముందుండి పనిచేస్తా

- Advertisement -

పాలకుడిగా కాదు – సేవకుడిగా పరిపాలనా చేస్తా
సర్పంచ్ అభ్యర్థి సింగూరి అలివేణి సత్యం
నవతెలంగాణ – సదాశివపేట

ఆత్మకూర్ గ్రామంలోని ప్రజల సేవ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సర్పంచ్ అభ్యర్థి సింగూరి అలివేణి సత్యం సార్ తెలిపారు. మంగళవారం ఆత్మకూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజలకు కల్లబొల్లి హామీలతో మోసం చేసే ప్రతిపక్ష నాయకులను సత్యం సార్ తీవ్రంగా విమర్శించారు. గ్రామ స్థాయికి అతీతంగా అసాధ్యమైన వాగ్దానాలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను పాలకుడిగా కాదు, గ్రామ సేవకుడిగా పని చేస్తానని స్పష్టం చేశారు.ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను విజయం సాధింపజేస్తే బాధ్యతాయుతమైన, పారదర్శకమైన పరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు.

విద్యావంతుడైన, ప్రజామెచ్చు నాయకుడిగా సత్యం సార్‌కు గ్రామంలోని పెద్దలు, మహిళలు, యువత విస్తృత మద్దతు తెలుపుతున్నారని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఆయన తరుపున గ్రామస్తులే స్వచ్ఛందంగా ఇంటింటి తిరిగి ప్రచారం చేయడం విశేషంగా నిలిచింది.గ్రామ అభివృద్ధిపై మాట్లాడిన సత్యం సార్ – యువత, మహిళల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని, అర్థులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరిస్తామని చెప్పారు.

ప్రతి గడపకు చేరుకుని ప్రజలతో మమేకమవుతూ ప్రచారం కొనసాగిస్తున్నాడు.“అనేకమంది శిష్యులకు ఉన్నత జీవితాలు అందజేసిన గురువు… అలివేణి సత్యం సార్‌కే మా ఓటు” అని గ్రామ ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు.

ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే అన్ని సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నాయకులు నాగేష్, మోతి సింగ్, రాజు, సంగమేశ్వర్, ప్రవీణ్, వెంకటేశం, నవీన్, రామస్వామి, రాందాస్, వినోద్, విద్యాసాగర్, శ్రీనివాస్, భీమ్రావు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -