Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగార్జునసాగర్ నియోజకవర్గం పలు గ్రామాల్లో ఆత్మీబందు కార్యక్రమం

నాగార్జునసాగర్ నియోజకవర్గం పలు గ్రామాల్లో ఆత్మీబందు కార్యక్రమం

- Advertisement -


నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసి రెడ్డి పాండన్న పలు గ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలకు అండగా వుంటున్నారు. పెద్దవూర మండలం ఏనెమీదిగూడెం గ్రామానికి చెందిన  బొడ్డుపల్లి రాములమ్మ, త్రిపురారం మండలం పలుగుతండాకు చెందిన రమావత్ మంగ్లీ, జీ అన్నారం గ్రామానికి చెందిన బట్టుమల్ల యాదగిరి, నిడమానూరు మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన కలకోట్లు సైదయ్య, గుర్రంపూడు మండలం మక్కపల్లి గ్రామానికి చెందిన అనుముల మల్లయ్య, తిరుమలగిరి సాగర్ మండలం జువ్విచెట్టు తండా మేరావత్ వస్త్రం మృతి చెందారని తెలియగానే వారి కుటుంబాలకి అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మబంధు కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క కుటుంబానికి 100 చొప్పున భోజనాలు పంపించారు. అణగారిన వర్గాలకు, నిరుపేద కుటుంబాలకు మన ఆత్మబంధు ఎల్లప్పుడు అండగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి  పిలుపునిచ్చారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 95817423567799585859 కు సంప్రదించవలసినదిగా కోరారు.నిరుపేదలని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ ఆత్మబంధు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -