Monday, November 17, 2025
E-PAPER
Homeజాతీయంగుజరాత్‌లో దారుణం..

గుజరాత్‌లో దారుణం..

- Advertisement -

పెండ్లికి గంట ముందు వధువును హత్య చేసిన వరుడు
ఇనుప రాడ్‌తో దాడి చేసి, తలను గోడకు కొట్టి హత్య

గాంధీనగర్‌: గుజరాత్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో గంటలో వివాహం జరగాల్సి ఉండగా, కాబోయే భార్యను ఓ యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పెండ్లి చీర, డబ్బు విషయమై చెలరేగిన చిన్నపాటి గొడవ ఈ ఘోరానికి దారితీసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. భావ్‌నగర్‌కు చెందిన సాజన్‌ బరయ్య (25), సోని రాథోడ్‌ (23) గత ఏడాదిగా సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు వీరి వివాహం జరగాల్సి ఉంది. బంధువులు, అతిథులు కూడా చేరుకున్నారు. అయితే, పెండ్లికి గంట ముందు రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరి మధ్య పెండ్లి చీర, ఖర్చుల గురించి తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సాజన్‌, ఇంట్లోని ఇనుప రాడ్‌తో సోనిపై దాడి చేశాడు. ఆమె చేతులు, కాళ్లపై కొట్టి, అనంతరం తలను గోడకు బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావంతో సోని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు సాజన్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసినట్టు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌ పటేల్‌ తెలిపారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -