Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నష్టపరిచిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి..

నష్టపరిచిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి..

- Advertisement -

– ముల్లంగి గ్రామంలోని దళితుల ఆస్తి నష్టాన్ని సందర్శించిన కెవిపిఎస్ జిల్లా బృందం 
నవతెలంగాణ – డిచ్ పల్లి

డిచ్ పల్లి మండలంలోని ముల్లంగి గ్రామంలోని దళితుల ఆస్తి నష్టాన్ని కెవిపిఎస్ జిల్లా బృందం ఆదివారం గ్రామాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ మాట్లాడుతూ ఈనెల 28  అకాల వర్షానికి పడిగ రాజు ప్రాపర్టీపైన ఉన్నటువంటి వరద ద్వారా నీరు రావడం ద్వారా కాల తీసివేయడం జరిగిందని, కొందరు దుండగులు ఇదే అదును చూసుకొని జాలి వేసిన జాలిని పీకేసి రాడ్లు విరిచేసి ఆస్తిని ధ్వంసం చేయడం అవివేకం అన్నారు. మధ్యలో  సాయిలు అడ్డు వచ్చి ఆగండి మేము తీసేస్తాము నీరంతా మాపొలానికి వస్తే కొట్టుకపోతాదని చెప్పినప్పటికీ వినకుండా జాన్సన్ చేసిన ఆస్తి నష్టాన్ని నలుగురు వ్యక్తులపైచర్యలు తీసుకోవాలని మధ్య వచ్చిన వారిని దుర్భాషలాడుతూ ధ్వంసం చేశారని, ఫెన్సింగ్ వైర్ ను రాళ్లను పీకి వేసిన వారిని గుర్తించి వారిపై ఆట్రా సిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ డిచ్ పల్లి ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరీఫ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నలవాల నర్సయ్య, జిల్లా నాయకులు చిన్న నర్సయ్య, గ్యారంగుల శ్రీనివాస్, రాపన సుదర్శన్ ,సతీష్,కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad