నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్‌ఏంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీరోజులాగే బాధితురాలు తన విధులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఓ వ్యక్తి ఆమెను బలవంతం చేశాడు. ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆసుపత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై కార్మికురాలిపై రాజు అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటనపై బాధిత మహిళ బోరబండ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజును అరెస్టు చేశారు. నిందితుడు మోడల్ కాలనీలో ఓ అపార్టెంట్‌లో వాచ్మెన్‌గా పని చేస్తున్నట్టు సమచారం.
హైదరాబాద్ లో దారుణం..పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగికదాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



