- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్మీ క్యాంప్‌పై గుర్తు తెలియని దుండగుల గ్రనైడ్లతో దాడికి పాల్పడిన ఘటన అస్సాంలోని తిన్సుకియా జిల్లాలోని కాకోపతర్‌లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఒంటి గంటల సమయంలో భారత సైన్యంలోని 19 గ్రెనడియర్స్ యూనిట్ శిబిరంపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రనైడ్లు విసిరినట్లుగా తెలుస్తోంది. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పేలుళ్లలో ముగ్గురు సైనిక సిబ్బంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఘటనా స్థలం చుట్టూ 2 నుంచి 3 కి.మీ మేర పరిధిని మూసివేసి పౌరుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.
- Advertisement -