- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తమపట్నం గ్రామస్తులు ఇవాళ దాడికి పాల్పడ్డారు. అయితే, ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, ఆక్రమణలు అడ్డుకున్న పాపానికి ఆమెపై మూకుమ్మడిగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది పురుషోత్తమపట్నంకు వెళ్లగా.. ఇరు పక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -