Thursday, November 20, 2025
E-PAPER
Homeకరీంనగర్ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వల్లంపట్లలో కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. వీడియో వైరల్ కావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలకు ఆదేశించగా, పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు బీఎన్ఎస్ 221, 132, 121(1) ప్రకారం తీవ్రమైన నేరాలని, కేసు నమోదైతే పాస్‌పోర్ట్‌, ఉద్యోగ అవకాశాలు ప్రమాదంలో పడతాయని సీపీ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -