Monday, July 7, 2025
E-PAPER
Homeజాతీయంవారిపై కాషాయ మూక‌ల దాడులు స‌రికాదు: రాకేష్‌ టికాయత్‌

వారిపై కాషాయ మూక‌ల దాడులు స‌రికాదు: రాకేష్‌ టికాయత్‌

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్: కన్వర్‌ యాత్ర పేరిట ముస్లింలపై దాడులు సరికాదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) జాతీయ ప్రతినిధి రాకేష్‌ టికాయత్‌ పేర్కొన్నారు. ముజఫర్‌ నగర్‌లోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కన్వర్‌ యాత్ర మార్గంలో గుర్తింపు ప్రచారం పేరిట కాషాయ మూకలు చేపడుతున్న దాడులను ఆయన ఖండించారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి బదులుగా యోగి ప్రభుత్వం స్పష్టమైన, శాంతియుత విధానాన్ని చేపట్టాలని అన్నారు. గుర్తింపు పేరిట హరిద్వార్‌లో కన్వర్‌ యాత్ర మార్గంలో ఒక ముస్లిం కుటుంబంపై దాడి చేసి వారి వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మతం పేరుతో నినాదాలు చేపట్టవద్దని, రెచ్చగొట్టే చర్యలకు కన్వర్‌ యాత్రను వేదికగా మార్చవద్దని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -