- Advertisement -
టిజి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రాజబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రామకృష్ణ గవాయిపై దాడికి యత్నం చేయడం హేయమైన చర్యని టిజి ఎమ్మార్సీస్ మండల అధ్యక్షుడు మంత్రి రాజబాబు మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశంలో పవిత్ర దేవాలయంగా పిలవబడే సుప్రీంకోర్టులో ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాల అనుకూలంగానే జడ్జిలు తమ తీర్పు ఇవ్వడం జరుగుతుందన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఒక్క తీర్పు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. జడ్జిపై దాడి చేసిన ఆ లాయర్ ఎంత మతం మత్తులో ఉన్నాడో తెలుస్తుందన్నారు. లాయర్ పై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
- Advertisement -