Thursday, March 19, 2026
E-PAPER
Homeక్రైమ్సదాశివపేటలో పండ‌గ పూట‌ మహిళపై హత్యాయత్నం

సదాశివపేటలో పండ‌గ పూట‌ మహిళపై హత్యాయత్నం

- Advertisement -

నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి: మెద‌క్ జిల్లాలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. సదాశివపేట పట్టణ పరిధిలోని భైపాస్ రోడ్డుపై ఓ మహిళపై హత్యాయత్నం జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం గుర్తు తెలియ‌న వ్య‌క్తులు వి.విజయ (45) అనే మ‌హిళపై కిరొసిన్ పొసి నిప్పించారు. స‌గం కాలిన గాయాల‌తో ప‌డివున్న మ‌హిళ‌ల‌ను గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..బాధితురాలిని చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ మహిళను ఎవరైనా నిప్పంటించారా, లేక ఆ మహిళనే ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. స‌దురు బాధితురాలు బొబ్బిలి గ్రామానికి చెందిన మ‌హిళ పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -