- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన శేత్కరి గణేష్ మండలి వద్ద బుధవారం రాత్రి వేలంపాట నిర్వహించారు. ఇందులో భాగంగా వెండి పది తులాల కడియం, సేపులు రెండు, శాలువా ఒకటి, ఈ మూడు రకాల వస్తువులకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో పది తులాల వెండి కడియంను గంగాధర్ బండి వార్ అనే భక్తుడు రూ.33,300 దక్కించుకున్నారు. ఇక సేపులు రెండింటినీ ఎండ్రికాయలవార్ నవీన్ రూ.9000 దక్కించుకున్నారు. శాలువాను పాకలవార్ సాయిలు రూ.3333 లకు దక్కించుకున్నారు. అనంతరం వీరిని గణేష్ మండలి నిర్వాహకులు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గణేష్ నిర్వాహకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -