Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeసినిమాటిక్కెట్‌ రేట్ల పెంపుపై ప్రేక్షకులు ఆగ్రహం

టిక్కెట్‌ రేట్ల పెంపుపై ప్రేక్షకులు ఆగ్రహం

- Advertisement -

‘డబ్బింగ్‌ సినిమాలకు కూడా టిక్కెట్‌ రేట్లు పెంచుతారా?, ఇలాగైతే మేం ‘వార్‌2’, ‘కూలీ’ సినిమాలను బారుకాట్‌ చేస్తాం’ అని తెలుగు ప్రేక్షకులు సోషల్‌మీడియా వేదికగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రశ్నిస్తూ,
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రజనీకాంత్‌, నాగార్జున, అమీర్‌ఖాన్‌, ఉపేంద్ర వంటి హేమాహేమీలు నటించిన ‘కూలీ’, ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘వార్‌2’ సినిమాలు ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాల టిక్కెట్‌ ధరలను పెంచాలంటూ మేకర్స్‌ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ‘కూలీ’ సినిమా విడుదల రోజు అదనపు షోకు (ఉదయం 5 గంటలు) ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.75 (జీస్టీతో కలిపి), మల్టీఫ్లెక్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈనెల 14 నుంచి 23 వరకూ ఈ పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. ‘వార్‌2’కి కూడా ఇదే వర్తించనున్నట్టు తెలిసింది. అయితే ప్రేక్షకుల నిరసన దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ధరలు పెంచలేదు. కానీ మార్నింగ్‌ షో కన్నా ముందు
ఒక్క స్పెషల్‌ షోకి మాత్రమే అనుమతి
ఇచ్చినట్టు సమాచారం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img