Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆగస్టు 13 రైతు బీమా చివరి తేదీ..

ఆగస్టు 13 రైతు బీమా చివరి తేదీ..

- Advertisement -

వ్యవసాయ శాఖ మండల అధికారి మల్లేష్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జూన్ 5వ తేదీ వరకు కొత్త పట్టాదార్ పాసు పుస్తకాలు పొందిన రైతులు 2025 రైతు బీమా పాలసీ కోసం ఆగస్టు 13వ తేదీ లోపు  దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి మల్లేష్ తెలిపారు. ఆదివారం అయన నవతెలంగాణ తో మాట్లాడుతూ  ఆగస్టు 13వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని పూర్తి వివరాలకు మండల వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు. 8వ పాలసీ సంవత్సరం అంటే 2025 పాలసీ సంవత్సరం 14 ఆగస్టు 2025   నుండి ప్రారంభమై 13 ఆగస్టు 2026తో ముగుస్తుందనారు. 14 ఆగస్టు 1966 నుంచి 14 ఆగస్టు 2007 వరకు జన్మించిన రైతులు రైతు బీమా పథకానికి అర్హులని తెలిపారు.

పుట్టిన తేదీ ఆధార్ ప్రకారం మాత్రమే పరిగణించబడుతుందని, రైతు ఎన్రోల్మెంట్ ఫారం, పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలు, రైతు  అతని/ఆమె నామిని ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు, నామిని బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం జిరాక్స్  కాపీలను రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులకు స్వయంగా సంప్రదించి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే రైతు బీమాకు నమోదు చేసుకున్న రైతులు తమ నమోదు రెన్యువల్ గురించి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులతో కన్ఫామ్ చేసుకోవలెను, ఏవైనా సవరణలు ఉంటే 12 ఆగస్టు లోపు  2025 లోపు సవరణకు సంబంధించి మద్దతు ఇచ్చే పత్రాలతో ఏ.ఈ.ఓ,  మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి, సవరణ చేయించుకోవాలని, రైతు భీమా  నమోదు కొరకు రైతు యొక్క వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ 59 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న రైతులు మాత్రమే అర్హులని తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img