నవతెలంగాణ – వనపర్తి
మంగళ వాయిద్యాలు మన సంస్కృతికి ప్రతీకలు అని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వనపర్తి జిల్లాలోని నాయిబ్రాహ్మణ సంఘం సభ్యులు వినాయక ఉత్సవాలు సోదరాభావంతో భక్తిశ్రద్ధలతో సాంస్కృతిక కార్యక్రమాలు, బాజ భజంత్రి, చెక్కభజన, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో అందరూ భాజ భజంత్రీలతో గణనాథునికి భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనాలు సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా ముగించడానికి కృషిచేసిన జిల్లా ఎస్పి రావుల గిరిధర్ ను జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు శాలువా పూలమాలతో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మన సంస్క్రతికి ప్రతీకలైన మంగళ వాయిధ్యాలను ఆ కళాకారులను మనం గౌరవించి ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలియజేశారు.
వనపర్తి జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమర్జనం కార్యక్రమాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఎస్పీ అన్నారు. ఉత్సవం ఎలాంటిదైనా అన్ని వర్గాల ప్రజలు సోదరాభావంతో భక్తిశ్రద్ధలతో సాంస్కృతిక కార్యక్రమాలు, బాజ భజంత్రి, చెక్కభజన, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో శాస్త్రీయంగా జరుపుకున్నారని అన్నారు. నాయి బ్రాహ్మణులు ఆర్థికంగా ఉపాధి పొందారని గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా చూపాలని ఎస్పీ సూచించారు. ఉత్సవం ఏదైనా ప్రజలంతా సంతోషంగా నిర్వహించుకోవాలని జిల్లా పోలీస్ శాఖ తరపున పూర్తి భద్రత రక్షణ ఎల్లప్పుడు కల్పించడం జరుగుతుందని అన్నారు.
గణేష్ ఉత్సవాల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి, జిల్లా పోలీస్ లకు సహకరించిన ప్రజలకు, ఉత్సవ కమిటీలకు, భక్తులకు, ముఖ్యంగా సమయస్పూర్తి చూపిన యువతకు ఎస్పీ అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసిన అన్ని శాఖల అధికారులకు, బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందికి అందరికి ఎస్పీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, నాయిబ్రాహ్మణ సభ్యులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మంగళ వాయిద్యాలు మన సంస్కృతికి ప్రతీకలు: ఎస్పీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES