నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంలో పలు దేశాలు సోషల్ మీడియాపై పలు రకాల ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. మంచి కన్నా చెడు ఎక్కువగా ప్రచారం వ్యాప్తి చెందడంతో ఆయా దేశాలు సోషల్ మీడియాపై పలు ఆంక్షలు విధిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 16 ఏండ్ల బాలబాలికలు సోషల్ మీడియా భారీ పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తాజాగా ఆదే బాటలో ఆస్ట్రేలియా వెళ్లింది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకాన్ని నిషేధిస్తూ.. ఆ దేశంలో జీవో తీసుకొచ్చింది. చిన్నారులను అడిక్టివ్ స్క్రీన్ టైమ్, హానికరమైన కంటెంట్ నుంచి రక్షించే లక్ష్యంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పిల్లలకు అందుబాటులో లేకుండా చేసింది.
ఈ చారిత్రక మార్పుపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ.. ఈ బాధ్యతను సాంకేతిక దిగ్గజాలపైకి (Tech Giants) మళ్లించడం, కుటుంబాలకు కొంత ఉపశమనం ఇవ్వడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ కొత్త చట్టం ద్వారా, యువత భద్రతపై మరింత దృష్టి సారించి, సోషల్ మీడియా సంస్థలు కఠినమైన వయస్సు ధృవీకరణ నిబంధనలను పాటించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.



