Wednesday, December 10, 2025
E-PAPER
Homeక్రైమ్Accident: అదుపుతప్పి ఆటో బోల్తా.. విద్యార్థి మృతి

Accident: అదుపుతప్పి ఆటో బోల్తా.. విద్యార్థి మృతి

- Advertisement -

ఐదుగురు విద్యార్థులకు గాయాలు
నవతెలంగాణ – జుక్కల్ 

మండలంలోని సావర్గావ్ గ్రామానికి చెందిన విద్యార్థి బుధవారం ప్రభుత్వ పాఠశాలకు గ్రామానికి చెందిన మిగతా విద్యార్థులతో కలిసి ఆటోలో వెళ్తన్న క్రమంలో ఆటో బోల్తా పడి కాంబ్లే ప్రణవ్ (15) విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సావర్గావ్ గ్రామానికి చెందిన 11 మంది విద్యార్థులు పాఠశాలకు స్వగ్రామం నుండి ఖండేబల్లూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు నిత్యం గ్రామానికి చెందిన డి .వినోద్ ఆటోలో రాకపోకలు సాగిస్తారు. ఈ క్రమంలో బుధవారం పాఠశాలకు వెళున్న సందర్భంగా అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న కే . ప్రణవ్, పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అక్కడికక్కడే సంఘటన స్థలంలో మృతి చెందడం జరిగింది. మిగతా ఐదుగురు పిల్లలకు చిన్నపాటి గాయాలపాలయ్యారు. వారిని మహారాష్ట్ర లోని దేగ్లూర్ , బిచ్కుంద, బాన్సువాడ, నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై తెలిపారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడకు తరలించామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -